ఆర్టీఐ సమాచారం ప్రకారం డీజిల్ ఇంజన్ ట్రైన్ ఒక్క నిమిషం ఆగితే రూ.20,401 నష్టం వాటిల్లుతుందట. అదే ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.20,459 నష్టం వాటిల్లుతుంది. అలాగే గూడ్స్ ట్రైన్ విషయానికి వస్తే, డీజిల్ ట్రైన్ ఒక్క నిమిషం ఆగితే రూ.13,334, ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే రూ.13,392 నష్టం వస్తుందట. అదేవిధంగా ట్రైన్ ఆగితే అది మళ్ళీ స్పీడ్ పుంజుకోవడానికి కనీసం మూడు నిమిషాల సమయం అవుతుందట. ఈ టైంలో డీజిల్ లేదంటే ఎలక్ట్రిక్ సిటీ ఎక్కువ ఖర్చవుతుంది. అంతేకాకుండా ఒక ట్రైను ఆగిపోతే, దీని వెనక వచ్చే అన్ని ట్రైన్స్ ను కూడా ఆపాల్సి ఉంటుంది.