వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసేటప్పుడు, ఏదైనా మరకలు అంటిన బట్టలు విడిగా ఉతికితే మంచిది. లేదంటే ఆ మరకలు మిగతా బట్టలకు కూడా అంటుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా డిటర్జెంట్ తో పాటు ఫ్యాబ్ లెస్ సాఫ్ట్నర్ ను కూడా వాడటం మంచిది. అది బట్టల యొక్క రంగును పోనివ్వదు. దీనికి తోడు బట్టలు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా ప్రతి నెల కంపల్సరిగా ఈ వాషింగ్ మిషన్ శుభ్రం చేసుకోవాలి.