ఓలా ఎలక్ట్రిక్ బైక్ ను ప్రకటించింది. ఇందుకోసం దేశంలోని దాదాపు 400 నగరాలలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఓలా కంపెనీ వెల్లడించింది.జూలై నెల నుంచి తమ అమ్మకాలను ప్రారంభిస్తున్నట్టు ఓలా గ్రూప్ సీఈఓ భవిశ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాదిలో దేశంలో ఉన్న 100 నగరాలలో 5,000 చార్జింగ్ పాయింట్లను ఓలా ఏర్పాటు చేయనుంది. కొద్దికొద్దిగా పెంచుకుంటూ 400 నగరాలలో లక్ష పాయింట్లను ఏర్పాటు చేయనుంది ఈ సంస్థ. అంతేకాకుండా తమిళనాడులో ప్రారంభించనున్న ఫ్యాక్టరీ జూన్ కల్లా సిద్ధం కానున్నట్లు ఓలా సంస్థ వెల్లడించింది.