నత్రజనిని ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ గా మార్చుకునేందుకు వీలయ్యే సరికొత్త సాంకేతికతను రూపొందించడమే.. బాంబే ఐఐటి సంస్థ, తమ సంస్థకు చెందిన ప్రొఫెసర్ మిలింద్ ఆత్రేయ క్రయోజనిక్ ఇంజనీరింగ్ లో నిపుణుడు. ఇక ఈయన సహకారం అంతోనే టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ తో కలిసి , ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టారని బాంబే ఐఐటి ఒక ప్రకటనలో వెల్లడించింది.నత్రజని ఉత్పత్తి ప్లాంట్ లోని అణుసంబంధ కార్బన్ జల్లెడ నుంచి జియో లైట్ కు మార్చడం ద్వారా ఈ నత్రజని ప్లాంట్లను, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను మార్చవచ్చని తెలిపింది. ఇక వాతావరణం నుంచి గాలిని ముడిపదార్థంగా తీసుకొని, ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయగలిగే ఇలాంటి ప్లాంట్ లో భారత దేశమంతటా వివిధ పరిశ్రమలలో ఉన్నాయని తెలిపింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి ఆక్సిజన్ రాబోతోందని కూడా తెలిపింది.