ఫ్లిప్ కార్ట్ యాపిల్ డేస్ సేల్ పేరిట యాపిల్ ఐఫోన్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ మే 14వ తేదీన ముగుస్తుంది. యాపిల్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్ ,క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే, ఆరు వేల రూపాయల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే యాపిల్ ఐఫోన్, ఐఫోన్ ఎక్స్ ఆర్, ఐఫోన్ ఎస్ ఈ, మ్యాక్, యాపిల్ వాచ్ , యాపిల్ ట్యాబ్ లాంటి ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.. ఐప్యాడ్, ఐఫోన్, ఐపాడ్ టచ్, మ్యాక్, యాపిల్ ట్యాబ్ కొనేవారికి ఒక ఏడాదిపాటు యాపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందించనుంది.