ఆక్సికేర్ సిస్టం..మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తుంది. రోగికి అవసరమైన ఆక్సిజన్‌ను , అతని శరీరంలోని SpO2 లెవల్స్ ఆధారంగా సరఫరా చేయడం దీని ప్రత్యేకత. ఈ పద్ధతి ద్వారా ఆక్సిజన్ వృథాను అరికట్టడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా హెల్త్‌కేర్ ఉద్యోగులపై పనిభారాన్ని కూడా ఆక్సికేర్ వ్యవస్థ తగ్గిస్తుంది.ఈ సిస్టమ్ ద్వారా ఆక్సిజన్ సర్క్యులేషన్‌ను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం కూడా లేదు. సాధారణ మెడికిల్ ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ సరఫరాను మాన్యువల్‌గా నియంత్రించాల్సి ఉంటుంది.