జన్ ధన్ ఖాతా కలిగి ఉండేవారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డు పై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ బెనిఫిట్ పొందాలంటే మీ జన్ ధన్ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు ను లింక్ చేసుకుంటేనే ఈ బెన్ఫిట్ లను పొందవచ్చు. ఒకవేళ లింక్ చేసుకోకపోతే ఈ బెనిఫిట్ పొందలేరు. అంతేకాకుండా జన్ ధన్ ఖాతా కలిగినవారికి కి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.ఈ ఇన్సూరెన్స్ ద్వారా రూ.30 వేల వరకు భీమా లభిస్తుంది. ఒకవేళ అకౌంట్ కలిగిన వారు మరణిస్తే, వారి కుటుంబానికి ఈ డబ్బులు లభిస్తాయి.