సింపుల్ ఎనర్జీ 2020లో ప్రోటోటైప్ వెర్షన్ మార్క్ 1 సిద్ధంగా ఉందని గతంలో వెల్లడించండి అయితే ఈ సంస్థ ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్ మార్క్ 2 ను అందుబాటులోకి తీసుకురానుంది.. నిజానికి మార్క్ 2 , మార్క్1 పై ఆధారపడి ఉంటుంది సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు. సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.." ప్రస్తుతం దేశంలో అధికంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. అందుకే కంపెనీ 2021 ఆగస్టు 15వ తేదీ ని ప్రకటించిందని, అప్పటి లోగ దేశంలో పరిస్థితులు సర్ధుకుంటాయని సంస్థ అంచనా వేసింది. ఇక ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం సింపుల్ ఎనర్జీ మార్క్ 2 ధర సుమారు రూ.1,10,000 నుండి రూ.1,20,000 వరకు రిటైల్ కి వచ్చే అవకాశం ఉంటుందని బెంగళూరు నగరంలో ఆగస్టు 15 న మార్క్ 2 ను విడుదల చేయనున్నట్లు" పేర్కొన్నారు..మార్క్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ 14.8 కిలో వాట్ల బ్యాటరీ తో పని చేస్తుంది. ఇది ఎక్కువగా మోడల్ లో సింగిల్ చార్జర్ తో 250 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. సుదీర్ఘ ప్రయాణాలకు సౌకర్యవంతంగా, ప్రయాణించడానికి వీలుగా ఈ సింపుల్ ఎనర్జీ స్కూటర్ సహాయపడుతుంది. ఇందులో టచ్ స్క్రీన్ డిస్ప్లే విత్ నావిగేషన్, బ్లూటూత్ వంటి ఇతర ఆసక్తికరమైన స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.