యూ ఎస్ లోని కేర్‌ప్లిక్స్ హెల్త్‌కేర్ అలాగే ఇండియా లోని కేర్‌నౌ హెల్త్‌కేర్ రెండు కలిసి సంయుక్తంగా నిర్మించిన మొదటి ఉత్పత్తి కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్. ఈ యాప్ ద్వారా హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ లెవల్స్ అలాగే శ్వాసక్రియ రేటు వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవడం కోసం మొబైల్ స్మార్ట్ ఫోన్ లో కెమెరా అలాగే ఫ్లాష్‌లైట్ ఉపయోగించి, స్కానింగ్ ద్వారా, ఆక్సిజన్ రేటు, శ్వాసక్రియ రేటును సులభంగా పరీక్షించవచ్చు.పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్‌లు పనిచేసే ఫోటోప్లెతీస్మోగ్రఫీ ఆధారంగా, స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్‌లైట్‌తో ఈ యాప్ పని చేస్తుంది. కెమెరా, ఫ్లాష్‌లైట్ మీద 40 సెకన్లు వేలిని ఉంచడం ద్వారా SpO2 ను లెక్కించవచ్చు. లైట్ ఇంటెన్సిటీలో తేడాలను పసిగట్టి ఫోటోప్లెతీస్మోగ్రఫీ గ్రాఫ్‌ను ఈ యాప్ సిద్ధం చేస్తుంది. ఈ గ్రాఫ్ సాయంతో SPo2 స్థాయి, పల్స్ రేట్ తెలుసుకోవ్చని కేర్‌నౌ హెల్త్‌కేర్ చెబుతోంది.