ఇకపై వాట్సాప్ లో మూడు రెడ్ టిక్కులు పడితే అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదని,మీ సందేశాలను, కాల్స్ ను ప్రభుత్వం రికార్డు చేయదు. వాట్స్అప్ కొత్తగా ఎలాంటి కమ్యూనికేషన్ నిబంధనలు అమలు చేయలేదు. 3రెడ్ లేదా బ్లూ టిక్ ఫీచర్ కూడా ఎక్కడా లేదు. వాట్సాప్ సందేశాలు ఎండ్ - టు - ఎండ్ ఎంక్రీప్షన్ కాబట్టి వాటిని చూడడానికి అసలు వీలుపడదు. కాబట్టి ఇకపై ఇలాంటి పుకార్లను నమ్మవద్దని వాట్సప్ కూడా హెచ్చరిస్తోంది..