అమెరికాకు చెందిన పలు సంస్థలు ఈ సరికొత్త ఫ్యాన్ లను రూపకల్పన చేశాయి. రెక్కలు లేకుండా ఫ్యాన్ లను తయారు చేసి, తమ దేశ వాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చేశాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ ఫ్యాన్ ల అమ్మకానికి బాగా పునాది వేసుకున్నాయిఈ రెక్కలు లేని ఫ్యాన్ థర్మల్ డెస్ట్రాటిఫికేషన్ టెక్నాలజీతో పని చేస్తాయి. వీటికి ఎలాంటి రెక్కలు ఉండవు. కేవలం 50 వాట్ల డీ సీ కరెంట్ మోటార్ మాత్రమే ఉంటుంది. ఇది మనం ఉండే పరిసరాలను బట్టి అందులోని వేడి గాలిని స్వీకరించి, డిస్కుల ద్వారా 360 డిగ్రీల్లో మన చుట్టూ ఉండే నాలుగు మూలలకు చల్లని గాలిని వెదజల్లుతుంది.ఇక కరెంటు బిల్ కూడా తక్కువ.ఈ ఫ్యాన్ల కనీస ధర ప్రస్తుతం: రూ.22,500 నుంచి రూ.26,000 దాకా ఉంటుంది.