మనిషి సాంకేతికు దగ్గర అవుతున్నా కొద్దీ మనిషిలో ఉన్న సారి కొత్త ఆలోచనలు ఎన్నో బయటకు వస్తున్నాయి. ఈ ఆధునిక యుగంలో ఆప్ వినియోగం కుడా గణనీయంగా పెరిగింది. మానవును అవసరం, అలవాట్లను బట్టి కొత్త కొత్త యాప్ లు పుట్టుకస్తునే ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ప్రధాన సమస్య బ్యాటరి బ్యాక్ అప్. అసలు ఇంక పవర్ ఇంకా ఎంత ఉంది. ఇంకా ఎంత సేపు మనం మొబైల్ ను యూజ్ చేయొచ్చు లాంటి తదితర అంశాలను మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.


డివైస్‌లను వాడుతున్న యూజర్ల కోసం '360 బ్యాటరీ ప్లస్ పవర్ సేవర్ (360 BATTERY PLUS - POWER SAVER)' పేరిట ఓ నూతన యాప్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. దాంతో ఏయే పనులను ఎంత సేపు చేసుకోవచ్చో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. డివైస్ బ్యాటరీ ఇంకా ఎంత ఉందో, ఏయే యాప్స్ ఎంత బ్యాటరీని వినియోగించుకుంటాన్నయో కూడా దీని ద్వారా తెలుసుకునేందుకు వీలుంది.  


బ్యాటరీ ఉష్ణోగ్రత, స్టేటస్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ సేవింగ్ ద్వారా యాప్స్ ఆటో స్టార్ట్ అవకుండా చూడవచ్చు. బ్యాటరీని సేవ్ చేసుకునేందుకు పవర్ సేవింగ్ మోడ్, కస్టమ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. 360 బ్యాటరీ ప్లస్ పవన్ సేవర్ యాప్ ద్వారా యూజర్లు తమ డివైస్ బ్యాటరీని సురక్షితంగా ఉంచుకోవచ్చు.


ఇందు కోసం పలు ఫీచర్లను ఈ యాప్‌లో అందిస్తున్నారు. వన్ ట్యాప్ ఆప్టిమైజర్ ద్వారా డివైస్ బ్యాటరీని సరిగ్గా పనిచేసేలా ట్యూన్ చేసుకోవచ్చు.  ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: