తక్కువ డబ్బుతో మంచి ఫీచర్స్ ఫోన్ కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా....? మరి రూ. 15 వేల లోపు వచ్చేసే ఈ బెస్ట్ ఫోన్స్ ని ఇప్పుడే చూసేయండి. మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఫోన్లు కూడా ఈ ధరల శ్రేణిలోనివే ఉంటాయి.  అక్టోబర్ నెలలో రూ.15 వేలలోపు ఫోన్లలో టాప్-5 స్మార్ట్ ఫోన్లు ఇవే..... ఫోన్స్ వివరాల్లోకి వెళితే....

రియల్ మీ నార్జో 20 ప్రో కూడా రూ.15 వేలలోపు వచ్చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..... దీని ధర రూ.14,999 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ని అందించడం జరిగింది. కెమెరా 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ ఉంది. సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ ఉంది. ర్యామ్ 6 జీబీ ఉండగా...బ్యాటరీ 4500  ఎంఏహెచ్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ పై పని చేస్తోంది.

అలానే  రియల్ మీ 7 కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంది. దీని ధర రూ.14,999 నుంచి ప్రారంభం అవ్వగా.... 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,  64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.  మోటో జీ9 ధర కూడా తక్కువే. రూ.11,499 నుంచి ప్రారంభం అవుతోంది. 48 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా,  8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు ఎన్నో ఫీచర్స్  ఉన్నాయి. అలానే పోకో ఎం2 ప్రో కూడా తక్కువ ధరకే వస్తోంది. రూ.13,999 నుంచి ప్రారంభం అవుతోంది.  రియల్ మీ 6ఐ ఫోన్ ధర రూ.12,999 నుంచి ప్రారంభం అవుతోంది. ఫీచర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: