
ప్రపంచమంతటా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే, తెలంగాణలో మరికొంత ఎక్కువగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ కరోనా వ్యక్తి చాపకింద నీరులా చేరి, ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు వినూత్నంగా ఆలోచించి, ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. ఇక దాని వివరాలు ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాదులో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో, సైబరాబాద్ పోలీసులు ఒక వెబ్ సైట్ ను వినూత్నంగా ఆవిష్కరించారు. కోవిడ్ కేసులు తదితర వివరాలను దీనిలోని పూర్తిగా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఎప్పటికప్పుడు ప్రజల కోసం అలాగే కరోనా బాధితుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్ పోలీసులు" సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) "సహకారంతో covid.scsc.in పేరుతో ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ముఖ్యంగా ఇటీవల వాట్సాప్,ఫేస్బుక్, సోషల్ మీడియా వంటి తదితర వెబ్సైట్లలో కొవిడ్‌పై రకరకాలైన అంశాలు కనిపిస్తున్నాయి. ఇష్టం వచ్చిన తీరుగా వార్తలను ప్రచురితం చేస్తున్నారు. ఇక వీటిని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి పరిస్థితులకు covid.scsc.in వెబ్‌సైట్ ఒక పరిష్కారం అవుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ పేర్కొన్నారు.
ఈ వెబ్సైట్ ద్వారా క్రిటికల్ కేర్ సర్వీసులు, సెల్ఫ్ కేర్ సర్వీసెస్, ప్రివెంటివ్ కేర్ సర్వీసెస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లకు సంబంధించిన అన్ని వివరాలను సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఈ వెబ్సైట్ ద్వారా మనకు కల్పించారు సైబరాబాద్ పోలీసులు. ఇక అంతే కాకుండా ఈ వెబ్సైటు ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అలాగే హాస్పిటల్ కు సంబంధించిన అన్ని విషయాలను పొందుపరిచారు. ఇక ముఖ్యంగా అంబులెన్సులు, ఆక్సిజన్ సప్లయర్స్, హాస్పిటల్స్‌తో పాటు వాటిలోని బెడ్స్ వివరాలు, ప్లాస్మా సపోర్ట్, బ్లడ్ బ్యాంకులు, అంతిమ సంస్కారాలు చేసే సంస్థలు , ఐసోలేషన్ సెంటర్ల వివరాలు, హోమ్ క్వారంటైన్‌పై సలహాలు ఇలా ఎన్నో రకాలుగా ఈ వెబ్సైట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలను పాటిస్తూ, బయటికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు..