టైటానిక్ అనగానే 1997లో హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఆంగ్ల చిత్రం అందరికీ గుర్తొస్తుంది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సునామి అంతాఇంతా కాదు. ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయిందంటే ప్రేక్షకులు థియేటర్లముందు బారులు తీరుతారు. మొన్నటికి మొన్న రిలీజైన 3D వెర్షన్ కూడా కోట్ల రూపాయిలను కొల్లగొట్టిందంటే ఆ సినిమా సత్తా ఏమిటో ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ను టైటానిక్ నౌక ప్రమాద నేపథ్యం లో తీయగా యావత్ ప్రపంచ సినిమా బాక్షఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఇక ఈ సినిమా లో నటించిన కధానాయకులు లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ అయితే ఓవర్ నైట్ సెలిబ్రిటీ లుగా మారి పోయారు. ఇక దర్శకుడు, నిర్మాత అయినటువంటి జేమ్స్ కామెరూన్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక అసలు విషయం లోకి వెళితే, ఈ సినిమాలు ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందో అనేదానికి ప్రస్తుతం జరిగిన ఓ విషయాన్ని తలమానికంగా తీసుకోవచ్చు.

అవును, ఓ వ్యక్తి టైటానిక్ సినిమా చూసి ప్రభావితం అయ్యి ఏకం గా టైటానిక్ షిప్ మాదిరిగా వున్న ఇంటిని నిర్మించుకున్నాడు. కోల్‌కతాలోని నార్త్ 24 పరగణాల జిల్లా లోని హెలెంచకు చెందిన మింటూ రాయ్ అనే రైతు తన ఇంటిని టైటానిక్ షిప్ మాదిరి నిర్మించడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. 20 ఏళ్లుగా వ్యవసాయం పై ఆధారపడి బ్రతుకున్న తాను.. తన సొంతింటి కలను తాజాగా నెరవేర్చుకోవాలనకున్నాడు. అయితే తనకి సహాయం చేసేందుకు ఏ ఇంజినీర్ సిద్ధం గా లేకపోవడం తో.. స్వయం గా తానే తన ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. దానికోసం నేపాల్ వెళ్లి తాపీ మేస్త్రీ గా మూడేళ్లు పనిచేసి పని మరీ నేర్చు కోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: