ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు కోటి మంది చిన్నారులు ఈ ఆటిజం సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకొని వారందికీ కూడా నూతన జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ సంస్థ సేవలను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ , తమిళనాడు, బెంగళూరు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల చిన్నారులకు కూడా చేరువ చేశారు. ఇక ఈమె ఈ సేవలను కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం చేయకుండా ఇతర దేశాల చిన్నారులకు కూడా సేవలు చేయాలని ఈమె సంకల్పించారు. ఇక అనుకున్నదే తమ సేవలను అమెరికా, కువైట్, ఖతార్, లండన్ వాసులు కూడా పొందుతున్నారు. ఇలా చిన్నారుల సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపుతున్న శ్రీజారెడ్డి సేవకు నిదర్శనంగా పిలుస్తున్నారు. ఆటిజం ఉన్న పిల్లలు ఈ సంస్థ ద్వారా ఉచితంగా సేవలను పొందవచ్చు. ఇక ఈ సమస్యలను అధిగమిస్తూ, చిన్నపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ సరిలేరు నాకెవరు అంటూ నిరూపించుకుంటున్నారు శ్రీజ రెడ్డి సరిపల్లి.