ఆసియాలోనే ప్రముఖ బయో ఫార్మా ఫ్యూటికల్స్ సంస్థ అయిన బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా ఇటీవల ఒక వీడియో ని షేర్ చేయగా అది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే ఎండిపోయిన ఆకుల వలె కనిపించే ఒక సీతాకోకచిలుక. ఇక ఇది చూసిన నెటిజన్లు అందరూ ఫిదా అవుతున్నారు.