కేంబ్రిడ్జ్ షైర్ ఆధారిత సంస్థ రోబో విజ్ఞానం ద్వారా సెన్సార్ సృష్టించబడింది. లండన్ లోని శాస్త్రవేత్తలు కరోనా వ్యక్తి దగ్గర ఉండే కొన్ని వస్తువులు (స్నాక్స్, బిస్కెట్స్), శరీర అవయవాలను తాకినతువంటి పరికరాలను పరీక్షించగా..98 నుంచి 100 శాతం వైరస్ ను గుర్తించింది. అయితే ఈ పరికరం పి సి ఆర్ కంటే చాలా వేగంగా గుర్తించగలదని అక్కడ పరిశోధకులు తెలిపారు. అక్కడ పరిశోధకులు 54 మందికి పైగా పరిశోధనలు చేయగా అందులో 27 మందికి వైరస్ సోకినట్లు తేలింది.తాజాగా ఈ సెన్సార్ పరికరం ద్వారా ఒక రూమ్ లో ఉండే మనిషి యొక్క వాసన ద్వారా కరోనా ను గుర్తించే పరికరాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దీనివల్ల కరోనా వైరస్ సోకిన వారిని కనుగొనడం చాలా సులభమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.