ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పెళ్లి ఒక మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం... బాగా పెళ్లి ని జరుపుకొని అతిధులకు విందు భోజనాలు పెట్టాలని కొంతమంది అనుకుంటారు.. కాని ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల అలాంటి పెళ్లిని చేసుకోవాలి అనే వారికి నిరాశ ఎదురైంది. ఎవరికీ కరోనా వస్తుందో అని అతిధులు విందు భోజనాలు లేని పెళ్లిళ్లు ఇప్పుడు జరుగుతున్నాయి.. అయితే..చెన్నైకు చెందిన ఓ కుటుంబానికి కత్తిలాంటి ఐడియా వచ్చింది.పెళ్లికి పిలిచి అతిథులను ఇబ్బందుల్లో  పడేయడం ఎందుకని ఆలోచించి.. విందును నేరుగా వారి ఇళ్లకే పంపించి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన శుభలేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


శుభలేఖ ప్రకారం.. డిసెంబరు 10న తమ కుమారుడి పెళ్లి జరుగుతోందని, అందరి ఆశ్వీరాదాలు కావాలని మెన్షన్ చేశారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుక లైవ్ టెలికాస్ట్ లింక్, పాస్‌వర్డ్ వివరాలను సైతం శుభలేఖలో రాశారు. చివరిగా.. అతిథుల కోసం భోజనాలను ఇంటి వద్దకే పంపిస్తున్నామని, దయచేసి వాటిని స్వీకరించాలని తెలిపారు.ఇలాంటి పెళ్లి విందు ఐడియా రావడం నిజంగా గ్రేట్ కదా. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరెన్నో వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: