మనిషి జీవితం దేవుడు చేతిలో కీలుబొమ్మ లాంటిది అన్న విషయం తెలిసిందే. ఈ విషయం ఎవరికైనా చెబితే ఏ ఊరుకోండి బాసూ కంప్యూటర్ యుగంలో కూడా పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెబుతూ ఉంటారు ఎంతోమంది. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత మాత్రం నిజంగానే మనిషి జీవితం దేవుడు చేతిలో కీలుబొమ్మ లాంటిది అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అని చెప్పాలి  ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కేవలం క్షణకాల వ్యవధిలో ఎంతోమంది ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇలా ఊహించని క్షణకాల మరణాలకు కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా అతీతం కాదు అన్న విధంగా ఇప్పటికే ఎన్నో మరణాలు సంభవించాయి అని చెప్పాలి. ఇక ఇలా ఎవరు ఊహించని రీతిలో సరదాగా గడుపుతున్న సమయంలో క్షణాల్లొ ప్రాణాలు వదులుతున్న  ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో.. మరింత ఉత్సాహంగా అందరూ ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ఇక పలు రాష్ట్రాలలో తమ సంప్రదాయానికి అనుగుణంగా గర్భ డాన్సులు చేస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇటీవల గుజరాత్ కు చెందిన యువకుడు అందరితో కలిసి సరదాగా గర్భ డాన్స్ చేస్తూ ఉన్నాడు.  కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆనంద్ జిల్లాలోని తారాపూర్ లో అతి శివశక్తి సొసైటీలో ఈ ఘటన జరిగింది  అందరితోపాటు ఎంతో ఆనందంగా స్టెప్పులు వేసిన  రమేష్ బాయ్ రాజపుత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వీడియో ట్విట్టర్ లో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: