వర్షాకాలం సీజన్ పూర్తయింది . ఇక ఏడాది అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే వర్షాలకు కురిసాయి అని చెప్పాలి. భారీ వర్షాలు కారణంగా ఎంతో మంది తీర ప్రాంతాల ప్రజలు ఎంతల అవస్థలు ఎదుర్కొన్నారో మాటల్లో చెప్ప లేనిది. ఇక భారీ వరదలు కారణం గా ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తం గా మారి పోయింది.. ఈ క్రమం లోనే వర్షాకాలం ముగిసింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయం లో అటు వర్షాలు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా దంచి కొడుతున్నాయి అని చెప్పాలి.  ఇంకా పలు రాష్ట్రాలలో గుండె పోటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.


 ఇక వరదల కారణం గా అటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు అని చెప్పాలి. ఇక అయితే ఇటీవల తెలంగాణ అంతట కుండ పోతా  వర్షం కురిసింది. ఈ క్రమం లోనే వికారాబాద్ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇలా వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో ఇక వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఇకపోతే ఇటీవల జిల్లాలోని తరూరు మండలం నాగారం వద్ద వరద ఉధృతికి వాగులో కారు చిక్కుకుపోయింది. అయితే కారులో ప్రయాణికులు మాత్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకున్నారు.


 తారూరు మండలం నాగారం గ్రామం వద్ద వాగులో శివ, లాస్య అనే దంపతులు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది అయితే అదృష్టవశాత్తు భార్యాభర్తలు ఇద్దరు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చేద్దుకొమ్మను పట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. పండగ ముగించుకుని వికారాబాద్ వెళ్దామని శివ, లాస్య బయలుదేరారు. అలాంటి సమయంలోనే వారి కారు వాగులో చిక్కుకుపోయింది. ఇక ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూడా వరదల్లో చిక్కుకుపోయి కారులోంచి బయటపడి చెట్టు కొమ్ముపై నిలబడగా అక్కడే ఉన్న స్థానికులు వారికి సహాయం చేసి రక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: