సాధారణంగా అమ్మాయి , అబ్బాయి మధ్య పుట్టేది ప్రేమ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అమ్మాయి కాదు తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య కూడా ఇలాంటి ప్రేమే ఉంటుంది. అక్క చెల్లెలు, అక్క, తమ్ముళ్ల మధ్య కూడా అదే ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ గురించి పెద్ద లిస్టు చెప్పుకోవచ్చు. అయితే కేవలం మనుషుల మధ్య కాదు మనుషులకి జంతువుల మధ్య కూడా ఇక ఇలాంటి అనుబంధం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో అయితే మనుషులకి జంతువులకి మధ్య బంధం మరింత బలంగా మారిపోయింది.



 ఎంతోమంది పెంపుడు జంతువుల పై అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. ఏకంగా సొంత బిడ్డల్లాగానే ఆప్యాయతలు చూపిస్తూ అమితమైన ప్రేమను పంచుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒక వ్యక్తికి చింపాంజీకి మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది. కోట్లు పెట్టిన ఇలాంటి ప్రేమ దొరకదేమో అని ఈ వీడియో చూశాక నేటిజన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు.



ఇక ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. తాను సంరక్షించిన ఒక చింపాంజీని చాలాకాలం తర్వాత వ్యక్తి కలుస్తాడు. అయితే అతని దూరం నుంచి గమనించిన చింపాంజీ పిల్ల ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చెంగుచెంగున ఎగురుకుంటూ వస్తుంది. ఇక ఎంతో ఆనందంతో అరుస్తూ పరుగులు పెట్టుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకుంటుంది. ఇక మరోవైపు నుంచి అతను కూడా ప్రేమగా తన చేతులు చాపి దానిని హత్తుకునేందుకు మోకాళ్లపై కూర్చుని పిలుస్తాడు. ఇక ఇలా చింపాంజీని హత్తుకున్న తర్వాత దానికి ముద్దు పెట్టి కన్నీటి పర్యంతం అయ్యాడు సదురు వ్యక్తి. ఇక ఈ వీడియో అందరిని ఫిదా చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: