
అక్కడే ప్రియా అట్లూరి తో ఆయన పరిచయం ఏర్పడి వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు పలు కథనాలు సైతం వెలుబడుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో కూడా నెట్టింట వైరల్ గా మారుతోంది. రాజారెడ్డి వైయస్ షర్మిల ,అనిల్ కుమార్ దంపతులకు పుట్టిన కుమారుడు.రాజా రెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అని తెలిసి అభిమానులు.. ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీయడం జరిగింది. అయితే ప్రియా అట్లూరి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. USA పౌరసత్వం కూడా కలిగి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రియా అట్లూరి ప్రముఖ వ్యాపారవేత్త చట్నీస్ సంస్థలకు అధినేత అయిన అట్లూరి విజయ వెంకటప్రసాద్ మనవరాలు అన్నట్లుగా సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి తో వైయస్ రాజారెడ్డికి మొదటిసారిగా చర్చిలో పరిచయం ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్పటినుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడడంతో గత నాలుగేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారనే వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం ఇచ్చినట్లుగా సమాచారం.
వచ్చే ఏడాది మే నెలలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాజారెడ్డి ప్రియా అట్లూరిది కులాంతర వివాహం అవుతుందని చెప్పవచ్చు. అసలే ఆంధ్రప్రదేశ్లో టిడిపి, వైయస్సార్ పార్టీల మధ్య కులం అనే పేరుతో ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలా వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకుంటున్నారు అని తెలిసి మరొకసారి కమ్మ - రెడ్డి మధ్య చిచ్చు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా వుండగా గతంలో వైయస్ షర్మిల - అనిల్ లది కూడా కులాంతర వివాహమే.. ఆమె భర్త అనిల్ కపూర్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం రాజారెడ్డి అమెరికా డల్హౌస్లో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.