తల్లి అవడం అనేది మామూలు విషయం కాదు.  దాని వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి . ఎన్నో నొప్పులు భరించాలి ఎన్నో ఇంజక్షన్లు వేయించుకోవాలి ..ఎన్నో సాక్రిఫైజ్ లు చేయాలి..ఎన్నో మెడిసన్స్ మింగాలి.. అలా అన్ని చేసిన తర్వాతే తొమ్మిది నెలలు కడుపులో బిడ్డ ఎదిగి బయటకు వస్తుంది . అయితే ఒక తల్లికి తొమ్మిది నెలలు పడ్డ కష్టం మొత్తం మరిచిపోయేలా చేస్తుంది.. బిడ్డ పుట్టిన తర్వాత ఆ మూమెంట్ . ప్రతి ఒక్క అమ్మాయికి అది లైఫ్ లో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది . తొమ్మిది నెలలు ఎన్నో నొప్పులు బాధలు భరించి బిడ్డను మోసి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను గుండెలకి హత్తుకుంటే  మాత్రం ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది.  ఆ తొమ్మిది నెలలు పడ్డ కష్టం బాధలు అన్ని సెకండ్స్ లోనే మరిచిపోతూ ఉంటారు .


కానీ ఈ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేసే భర్తలు మాత్రం చాలా తక్కువ.  సాధారణంగా భర్తలు డెలివరీ  అవుతున్న మూమెంట్లో టెన్షన్ పడతారు ..ఆలోచిస్తారు ..ఏం జరగకూడదు దేవుడా అంటూ మొక్కుకుంటారు. కానీ ఇక్కడ ఈ భర్త మాత్రం తన భార్య డెలివరీ రూమ్ కి వెళ్ళగానే చేసిన పనికి డాక్టర్లు సైతం షాక్ అయిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉమన్ కైరా ఫాతిమా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఈ వీడియోలో తన భార్య డెలివరీకి సిద్ధమవుతూ లేబర్ రూమ్ లోకి వెళ్లే క్షణాలలో భర్త ఆసుపత్రి సిబ్బంది ముందు ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు .



"నా భార్యను బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతటి వేదన భరించాలో అన్న ఆలోచనతోనే అతను తట్టుకోలేక కన్నీటి పర్యంతమైపోయాడు". అంతేకాదు డాక్టర్ "మీరు మీ భార్యని ఎంతగా ప్రేమిస్తారు..?" అని అడిగినప్పుడు ఆయన కన్నీరు పెట్టుకుంటూ "చాలా ప్రేమిస్తా చాలా చాలా"  అంటూ ఆ వీడియోలో చెప్తూ ఉంటాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . డెలివరీ సమయంలో 7 లేయర్లు కట్ చేస్తారు . ప్రతి సీ సెక్షన్ చేయించుకునే అమ్మాయికి ఈ బాధలు తప్పవు.  ఇది ప్రతి భర్త తెలుసుకోవాలి. నార్మల్ డెలివరీ అయిన సి సెక్షన్ డెలివరీ అయిన ఆ తల్లి పడే బాధ ఆమెకే తెలుస్తుంది . తల్లిని గౌరవించండి అంటూ డాక్టర్ ఫాతిమా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .



అంతే కాదు ప్రతి అమ్మాయికి ఇలాంటి ప్రేమించే భర్త దొరికితే హ్యాపీ అంటూ అందరూ మాట్లాడుతున్నారు.  ఇప్పటికే ఈ వీడియో నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేయగా వేలాది కామెంట్లు చేస్తున్నారు . నిజంగానే ఇలాంటి భర్త దొరికితే ప్రతి అమ్మాయి లైఫ్ హ్యాపీగానే ఉంటుంది అంటూ జనాలు ఈ వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు . కొంతమంది ఏకంగా ప్రతి మగాడు మొగుడు చూడాల్సిన వీడియో ఇది తన భార్య డెలివరీ మూమెంట్లో ప్రతి భర్త ఇలా స్పందిస్తే ఇలా చేస్తే కచ్చితంగా ఆ భార్య ఆ క్షణాలను  ఎప్పటికీ మర్చిపోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!





మరింత సమాచారం తెలుసుకోండి: