జూలై 5 - 2005 ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక భయంకరమైన తేదీగా నిలిచిపోబోతుందా? ఆ రోజు సునామీ వచ్చి వేల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోబోతున్నారా ..? అల్లకల్లోలంగా ప్రపంచం మారిపోబోతుందా..?  అంటే ఎస్ అనే సమాధానమే వినిపిస్తుంది బాబా వంగా జాతకం ప్రకారం. బాబా వంగా రీసెంట్ గా చెప్పిన జ్యోతిష్యం ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తుంది.  బాబా వంగ ఈ పేరు వినని వారు చాలా తక్కువ మందే ఉంటారు.  ఈ మధ్యకాలంలో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. బల్గేరియాకు చెందిన బాబా వంగ చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయింది . ఆ తర్వాత ఆమె తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలు చూడగలిగింది అని చాలామంది నమ్ముతూ ఉంటారు.


ఇప్పటివరకు ఆమె చెప్పింది చెప్పినట్లు జరగడం విశేషం . న్యూయార్క్ ట్వి  టవర్స్ పై ఉగ్రదాడి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్  నిష్క్రమణ.. రష్యా ఉక్రేయన్ యుద్ధం .. రీసెంట్గా జరిగిన ఫ్లైట్ క్రాష్ యాక్సిడెంట్ ఇలా అనేక విషయాలు ఆమె చెప్పింది చెప్పినట్లే జరిగాయి . మరీ ముఖ్యంగా కరోనా విషయంలో ఆమె చెప్పింది 100% జరగడం అందరూ ఆమె చెప్పే జాతకాన్ని నమ్మేలా చేసింది . ఇప్పుడు బాబావంగా మరోసారి వార్తల్లో హైలైట్ అయ్యారు . జులై ఐదు సునామీ రాబోతుందట ఒకరు కాదు ఇద్దరు కాదు వేల లక్షలాదిమంది ఈ సునామీలో మరణిస్తారట . ఒక దేశం మొత్తం అడ్రస్ లేకుండా పోతుందట.



అయితే ఈ సునామీ అంచనా వేసింది బల్గేరియా బాబా వంగ కాదు ..జపాన్ బాబా వంగ .  జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్ కి జపాన్ బాబా వంగగా పిలుస్తూ ఉంటారు జనాలు . ఈ జపాన్ బాబా వంగ కొమిక్ పుస్తకం "ది ఫ్యూచర్ ఐసా లో" జులై ఐదు 2025న జపాన్ లో భారీ సునామీ రాబోతుంది అని రాసుకొచ్చారు . ఈ బుక్ 1999లో మొదటిసారి పబ్లిష్ అయింది . అందులో రియో అనేక భవిష్యత్తు సంఘటనలు తన దివ్యదృష్టితో చూసినట్లు తెలుపుతూ రాశారు . ప్రారంభంలో ఈమెకి పెద్దగా పాపులారిటి లేజపోయినా ..ఆ  తర్వాత ఆమె చెప్పిన విషయాలు కొన్ని నిజం కావడంతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది .



ఆ పుస్తకంలో 2025 జూలైలో ఒక విపత్తు రాబోతుంది అని జపాన్ - ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర  గర్భంలో చీలిక ఏర్పడుతుంది అని .. ఆ ప్రళయ గోష కారణంగా ఒక దేశం మొత్తం మ్యాప్ లో లేకుండా పోతుంది అంటూ రాసుకుంది . ఇప్పుడు ఇదే విషయాన్ని జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . నిజంగానే జపాన్ బాబా వంగ రాసినట్లు నిజమైతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి ..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . మరి కొంతమంది జపాన్ టూర్ ని కూడా వాయిదా వేసుకుంటున్నారు.  ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు జపాన్ కి టూర్ కి ప్యాకేజీలు బుక్ చేసుకుని చాలా మంది క్యాన్సిల్ చేసేసుకున్నారు.  ఈస్టర్ సెలవల కోసం జపాన్ కు రావాల్సిన బుకింగ్ లో 50% తగ్గినట్లు జపాన్ గవర్నమెంట్ ప్రకటించింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: