
మరీ ముఖ్యంగా గూగుల్ - ఫేస్ బుక్-యూట్యూబ్- టెలిగ్రామ్ వంటి వాటిపై ఈ పాస్ వర్డ్ లీక్స్ తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్లు నిప్పుణులు హెచ్చరిస్తున్నారు . ఈ ఘటనను సైబర్ సెక్యూరిటీ దృష్ట్యా పెద్ద ముప్పుగా భావిస్తున్నారు. దీని ద్వారా యూజర్స్ పర్సనల్ సమాచారం మొత్తం కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు . వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని టెక్ వర్గాలు అంటున్నాయి.
దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి..?
డేటా పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లీక్ అయిన డేటా మొత్తం అన్ సెక్యూర్ సర్వర్ లో గుర్తించారట. అంతేకాదు చాలా తక్కువ మంది ప్రయత్నంతో అందరినీ యాక్సిస్ చేసేలా ఇది ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. సర్వర్లో నిబంధనలో ..ప్రభుత్వ వెబ్సైట్లు.. బిజినెస్ ఈమెయిల్స్.. పాపులర్ సోషల్ మీడియా అకౌంట్ క్రెడిన్షియల్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది . ఈ ప్రదర్శన వల్ల అనేకమంది వ్యక్తిగత కార్పొరేట్ సంస్థల డేటా కూడా పూర్తి ప్రమాదంలో పడిపోయింది అంటున్నారు డేటా పరిశోధకులు.
గూగుల్ హెచ్చరిక:
ఈ విషయం తెలిసి తెలియగానే గూగుల్ తన యూజర్లను హెచ్చరించింది . అత్యవసరంగా ఉన్నఫలంగా తమ ఐడి - పాస్ వర్డ్ లను వెంటనే మార్చుకోవాలి అని సూచించింది . ముఖ్యంగా ఈమెయిల్ బ్యాంకింగ్ అకౌంట్లో కోసం దీనిని పాటించాలి అంటూ తెలిపింది . పాస్ వర్డ్ లను సురక్షితంగా ఉంచుకోవడం కోసం గూగుల్ కొన్ని సూచనలు కూడా ఇచ్చింది. అవేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
* పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి: ముఖ్యమైన సేవలతో (ఈ మెయిల్, బ్యాంకింగ్) ఉన్న అకౌంట్ల పాస్‌వర్డ్‌లను కచ్చితంగా వెంటనే మార్చండి
* చాలా బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి: అంటే అక్షరాలు, సంఖ్యలు, ఇతర చిహ్నాలు కలిగిన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి
* టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2Fఆ)యాక్టివేట్ చేసుకోండి :2Fఆ ద్వారా అదనపు రక్షణ వ్యవస్థ ఏర్పాటు
* పొరపాటున కూడా మీకు అవసరమైన లింక్‌లను క్లిక్ చేయవద్దు
* పరసనల్ సమాచారం షేర్ చేయద్దు