మానవుని జీవితంలో చాలా దశలు ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైన దశలు పుట్టుక, పెళ్లి, వృద్ధాప్యం మరియు మరణం. ఏ మనిషైనా గెలవాలని ఆలోచిస్తాడు. ఈ ప్రపంచంలో ఓటమిని కోరుకునే వారు ఎవరూ ఉండరేమో. ఎందుకంటే మనము పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు గెలుపే ప్రధానంగా మనవాళ్ళు, బంధువులు, స్నేహితులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అందుకోసం మనము కూడా మనసులో ఇష్టం ఉన్నా లేకున్నా గెలుపు కోసమే పోరాడుతూ ఉంటాము. గెలుపులో చాలా రకాలు ఉంటాయి.

కొన్ని గెలుపులు శాశ్వతంగా ఉంటాయి. అంటే, మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడితే లైఫ్ లాంగ్ డబ్బుకు కొదువ లేకుండా కష్టాలు లేకుండా బ్రతికేయచ్చు. ఇది శాశ్వత గెలుపు. అలా కాకుండా కొన్ని అంటే... మీరు జాబ్ లోకి వచ్చాక ఒక టీమ్ కి లీడర్ అయ్యారు అనుకోండి. అప్పుడు మీకు నిరంతరం ఇచ్చే టాస్క్ లు, గోల్, మరేదైనా నిర్ణీత సమయం లోపు చేసి చూపించాలి. ఇవి తాత్కాలిక గెలుపు అంటాము. ఇప్పుడు తాత్కాలిక గెలుపులో ఒక టీమ్ ను ముందుండి నడిపిస్తూ ఎలా గెలవాలి అనేది చూద్దాం.

* ఒక టీమ్ కు మీరు సారధిగా ఉంటే మీపై అదనపు బాధ్యత పెరుగుతుంది. ముందుగా మీ టీమ్ లో ఉన్న సభ్యులు అందరి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. వారి సామర్ధ్యం గురించి అవగాహన ఉండాలి.

* దానిని బట్టి మీకు ఇచ్చిన టాస్క్ లో ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలో తెలుస్తుంది. వర్క్ వారికి ఇచ్చిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయా అన్నది మీరే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే టైం లిమిట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు అడగడం లేట్ చేసినా మీరు టార్గెట్ పూర్తి చేయడం ఆలస్యం అవుతుంది.

* అందరితో పాజిటివ్ గానే మాట్లాడుతూ వర్క్ చేయించుకోవాలి. ఏ మాత్రం లీడర్ అన్న ఫీలింగ్ వాళ్లపై చూపించినా తేడా కొట్టే అవకాశం ఉంది. సమయం విలువ వారికి తెలిసేలా చేయాలి.

* ఈ పనిని పూర్తి చేస్తే వచ్చే బెనిఫిట్ ను వారికి తెలియచేస్తే, ఆసక్తిగా పని చేస్తారు.

* ఒక్కోసారి అనుకున్న విధంగా అనుకున్న సమయానికి టాస్క్ లు పూర్తి కావు. అలాంటప్పుడు మీరు వారిపై మీ కోపాన్ని ప్రదర్శిస్తే ప్రమాదమే. అందుకు వారికి దైర్యం చెప్పి మళ్ళీ ప్రయత్నించండి అని చెప్పాలి.

ఇలా పై విధంగా చేస్తే మీ టీమ్ లో ఉన్న సభ్యులు మీపై ప్రత్యేక అభిమానంతో మెలగడమే కాకుండా మంచి వర్క్ ను అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: