మనలో చాలామంది ప్రతిరోజూ కలలు కంటారు. అయితే ఆ కలలను నిజం చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. తన సక్సెస్ తో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడంతో పాటు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న స‌రిప‌ల్లి కోటిరెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేజీవీ గ్రూప్ చైర్మన్ కోటిరెడ్డి సరిపల్లి సక్సెస్ సీక్రెట్ గెలుపు కోసం వెనుకడుగు వేయకపోవడమే అని చెప్పవచ్చు.

సాధారణంగా  మనలో  చాలామంది ఒకటి రెండుసార్లు ఫెయిల్యూర్ ఎదురైతే గెలుపు విషయంలో తెగ టెన్షన్ పడతారు.  అయితే టెన్షన్ పడకుండానే జీవితంలో గెలవవచ్చని  కోటిరెడ్డి సరిపల్లి  సక్సెస్ స్టోరీ చదివితే  అర్థమవుతుంది.  పదో తరగతి అర్హతతోనే మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సాధించిన కోటిరెడ్డి  కృషి, పట్టుదల, అంకితభావంతో  సక్సెస్  సాధించడం సాధ్యమేనని ప్రూవ్ చేశారు.

750 రూపాయల సంపాదనతో  కోటిరెడ్డి ప్రస్థానం మొదలు కాగా  ప్రస్తుతం  కోటిరెడ్డి కంపెనీల టర్నోవర్ 1100 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.  సీ  లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకుంటూనే విద్యార్థులకు పాఠాలు చెప్పిన కోటిరెడ్డి  మైక్రోసాఫ్ట్ కంపెనీలో 12 రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేసి  పదో తరగతి చదువుతో మన  దేశం నుంచి మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయిన  తోలి వ్యక్తిగా కోటిరెడ్డి నిలిచారు.  తన సంపాదనలో 33 శాతం సేవా కార్యక్రమాల కోసం ఆయన ఖర్చు చేస్తున్నారు.

ఏదో  ఒకరోజు గెలుస్తామనే ఆత్మవిశ్వాసం ఉండాలని  ఇరవై బాల్స్ లో  ఒక్క పరుగు తీసినంత మాత్రాన ఓడిపోతామని అనుకోవద్దని  గెలవాలనే ఆత్రుత కంటే సునిశిత పరిశీలనతో ఒక్కొక్కటి నేర్చుకోవాలనే ధ్యాస మంచిదని ఆయన చెబుతున్నారు.  సాధించిన సక్సెస్  ఉత్సాహాన్ని  ఇవ్వాలే  తప్ప ఒత్తిడిలా అనిపించకూడదని కోటిరెడ్డి సరిపల్లి  చెబుతున్నారు.  ఉద్యోగులను కుటుంబ సభ్యులలా చూసుకునే కోటిరెడ్డి సరిపల్లి   తాను కెరీర్ పరంగా ఎంతో  ఎదుగుతూ తన ద్వారా ఎంతోమంది  ఎదగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: