గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ల మార్పు, శారీరక అసమానతలు వల్ల గర్భిణీ స్త్రీలలో నిద్ర లేమి సమస్య మొదలవుతుంది. చాలా మంది  గర్భిణీ స్త్రీలు నిద్రలేమి  సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించింది.  గర్భిణీ మహిళల నిద్రలేమి సమస్యకు కొన్ని టిప్స్ ఉన్నాయి అవేంటో చూద్దామా..!

 

గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి అనేది సహజమైన సమస్య. గర్భము దాల్చాక ఎంతో కొంత నీరసము అతినిద్ర ఉండడము సహజమే కాని ఎక్కువ అలసట , మరీ నిద్రపోవడము మంచిది కాదు. ఉదయం నిద్ర లేవటం అనేది మీకు తరచూ ఎదురయ్యే సవాలు. ఉల్లాసంగా విశ్రాంతిగా మరునాడు మేల్కోవాలంటే మీరు ఒక దినచర్య అలవాటు చేసుకోవాలి. కొన్ని టిప్స్ వల్ల మీ ప్రెగ్నెన్సీలో చక్కని నిద్ర మీ సొంతం అవుతుంది. కాని మరీ మీ నిద్రలేమి సమస్య ఎక్కువ ఉంటే మీ డాక్టరుని సంప్రదించటం మంచిది.ప్రెగ్నెన్సి సమయంలో మీరు వాడే పిల్లోస్ అంటే తలగడ దిండ్లు అదనంగా వాడటం మంచిది. పడుకునేటప్పుడు మీ కడుపుకీ, వెనుక భాగంలో అంటే పిరుదుల దగ్గర పిల్లోస్ వేస్కోవాలి.

 

 

దీని వల్ల మీ కడుపుకీ ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాక మీ రెండు కాళ్ళ మధ్య ఒక పిల్లో వేసుకోవాలి. దీనివల్ల మీ కింది భాగంలో సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని పిల్లోలు ఆకారంలో ఇరుకుగా ఉండేవి, అలాగే పూర్తిగా శరీరానికి   సరిపడే పిల్లోలని వాడటం మంచిది.ఒక గ్లాస్ పాలు త్రాగటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. కార్బోహైడ్రేడ్లు ఉన్న పదార్ధాలను తీసుకోవటం మంచిది. బ్రెడ్, క్రాకర్లు మీ నిద్రను పెంచుతాయి. అంతేకాక కొన్ని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న స్నాక్స్ తీసుకోవటం వల్ల మీ బ్లడ్ షుగర్ ను పెంచటమే కాక మీకు చెడు కలలు రాకుండా, తలనొప్పులు రాకుండా చేస్తాయి.విశ్రాంతి తీసుకోవటం వల్ల మీ మనస్సు కి, కండరాలకూ విశ్రాంతి పొందుతాయి. ఈ మార్గాల్లేమిటంటే యోగ, మస్సాజ్, స్ట్రెచింగ్ లాంటివి. ఎక్కువగా శ్వాస తీసుకోవటం, వేడి నీళ్ళతో స్నానం, పడుకునే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి.అలాగే  నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి.

 

నిద్రించే సమయంలో ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి.మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎక్కువ  కోపం, ఉద్రేకం, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. అలాగే ఎక్కువ సేపు వీటి గురించి ఆలోచించకూడదు. మీ బిడ్డ గూర్చి తప్ప వేరే ఎలాంటి విషయాలు ఆలోచించకుండా చక్కగా హాయిగా నిద్రించండి సుమా... !!

మరింత సమాచారం తెలుసుకోండి: