గర్భం ధరించిన స్త్రీ బిడ్డను ప్రసవించిన తర్వాత పిలల్లకు పాలు పడితే పెరిగిన బరువు తిరిగి తగ్గే వీలుంటుంది. అలాగే తల్లీ బిడ్డల బంధాన్ని పెంపొందించడంలో తల్లి పాల పాత్ర చాలా ముఖ్యమైనది. మీకు బిడ్డతో గడిపేందుకు చాలా సమయం దొరకడంతో పాటు.. బిడ్డకు కూడా ఎన్నో పోషకాలతో నిండిన పాలు దొరుకుతాయి.బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల చాలా డబ్బు మిగలడంతో పాటు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డకు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న పాలు.ఎలాంటి ఇన్ఫెక్షన్ల భయం లేకుండా అందించే వీలుంటుంది.బిడ్డకు పాలు పట్టిన తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ అలాగే ఒవేరియన్ క్యాన్సర్లు వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది.
ప్రసవం తర్వాత బిడ్డలకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చే తల్లుల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. పాలు పట్టేటప్పుడు విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్ల వల్లే ఇది సాధ్యమవుతుంది.అలాగే బిడ్డతో సమయం గడిపేందుకు మీ ఇద్దరి మధ్య బలాన్ని మరింతగా పెంచేందుకు ఇది చక్కటి మార్గం.పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు తల్లి పాలు పట్టడం ద్వారా బిడ్డ యొక్క ఆరోగ్యం జీవితాంతం బాగుంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి