ఇక ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాల్లో అప్డేటెడ్ ఫీచర్లను ప్రవేశపెట్టి ఎంతో అత్యంత నాణ్యతతో వాహనాలు వినియోగదారులకు అందిస్తోంది ఓలా కంపెనీ.అయితే ఈమధ్య జరిగిన ఓ సంఘటన మాత్రం ఓలా కంపెనీకి పెద్ద షాక్ ని ఇచ్చింది. ఎంతలా అంటే ఇప్పటి వరకు ఉన్న ఎస్1 బైక్ మోడళ్లు అన్నింటినీ కూడా ఫ్రీగా అప్ గ్రేడ్ చేస్తామని ఓపెన్ ఆఫర్ల ఇచ్చేంత లా చేసింది ఆ సంఘటన.ఇండియాలోని ఫేమస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన ఎస్1 స్కూటర్ల ఫ్రంట్ ఫోర్క్‌ ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది.కంపెనీ తన నిరంతర ఇంజినీరింగ్ ఇంకా డిజైన్ మెరుగుదల ప్రక్రియలో భాగంగా రీసెంట్ గా ఫ్రంట్ ఫోర్క్ డిజైన్‌ను మరింత మన్నిక ఇచ్చేలా ఇంకా దాని బలాన్ని మరింత పెంచేలా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది.ఎస్1 స్కూటర్లలో ఫ్రంట్ సస్పెన్షన్ బ్రేకేజ్‌ల నివేదికలపై ఓలా రీసెంట్ గా చాలా రకాల విమర్శలను ఎదుర్కొంది.


దీనిపై మార్చి 14 వ తేదీన ఓలా ఎలక్ట్రిక్ సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇచ్చింది.ఇంతకీ ఏమైందంటే ఇటీవల ఎస్1 స్కూటర్ పై ఓ యువకుడు సుమారు 35 kmph వేగంతో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ విరిగిపోయి ఆ యువకుడు కింద పడిపోయాడు. దీంతో అతనికి బాగా గాయాలయ్యాయి. ఈ సంఘటన వలన ఓలా కంపెనీ తీవ్ర విమర్శలపాలైంది. ఎస్1 ఫోర్క్ లో లోపాలున్నట్లు అంతా కూడా ఓలా కంపెనీ పై మండిపడ్డారు. దీనిపై ఓలా కంపెనీ ప్రాథమిక దర్యాప్తుని చేపట్టి.. తమ విశ్లేషణలో ఇది చాలా ఎక్కువ ప్రభావం చూపిన రోడ్డు ప్రమాదం అని వెరిఫై చేసింది.సో అందువల్ల తమ ఎలక్ట్రిక్ బైక్ లని ఫ్రీగా అప్గ్రేడ్ చేస్తామని ఓలా కంపెనీ ప్రకటించింది. ఇలానే ఓలా ప్రమాదకర సంఘటనలు కనుక జరిగితే ఓలా కంపెనీ ఖచ్చితంగా మూత పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి సక్రమంగా పని చేసి తన బ్రాండ్ వాల్యూని కాపాడుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: