భారత దేశంలో అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న వాహనాల్లో హోండా ఇండియా సంస్థ కూడా ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఈ సంస్థ హోండా డబ్ల్యూ ఆర్ వి మోడల్ భారత విపణిలోకి విడుదల చేయబోతోంది. ఈ కార్ ధర రూ. 8 లక్షల 49వేలుగా సంస్థ నిర్దేశించింది. అత్యధిక సాంకేతికత ఫీచర్లు మొదలగు ప్రత్యేకతలతో ఈ మోడల్ చూపరులను ఆకట్టుకునేలా ఉంది. దీనితోపాటు ఎక్స్టీరియర్ స్టైలింగ్ రిచ్ ఇంటీరియర్ లతోపాటు బి.ఎస్ 6 అనుగునంగా డీజిల్, పెట్రోల్ ఇంజన్ లను ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చింది. 

IHG


అలాగే ఈ కారు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎస్ వి, విఎక్స్ అనే వేరియంట్లలో దీన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇందులో మనము పెట్రోల్, డీజల్ ఇంజన్లను సొంతం చేసుకునేలా ఉన్నాయి. మరోవైపు ఇందులో 6 కలర్స్ లో మనకు కార్స్ లభ్యమవుతున్నాయి. ఇందులో గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్రీమియం నెంబర్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెరల్, స్టిల్ మెటాలిక్ కలర్స్ లో మనం ఈ కార్లను సొంతం చేసుకోవచ్చు. వీటిపై కంపెనీ రెండేళ్ల వారెంటీ కూడా ఇవ్వనుంది.

IHG

 

ఇక ఈ కారులో ఫీచర్లు విషయానికి వస్తే ఎలాంటి కొదవలేదు. అడ్వాన్సుడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఇందులో కొన్ని ఫీచర్లను స్మార్ట్ఫోన్ కు అనుసంధానం చేసుకుని స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. వాయిస్ కమాండ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్లెస్ ఇన్ ఫార్వర్డ్ రిమోట్ కంట్రోల్ లాంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఈ కారు ప్రత్యేకతలు విషయానికొస్తే... మల్టీ ఇన్ఫర్మేషన్ కాంబి మీటర్ ఈకో అసిస్ట్, హ్యాండ్స్ ఫ్రీ, క్రూయిస్ కంట్రోల్ లాంటి మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులోని ఇంజన్ విషయానికొస్తే 1.2 లీటర్ i-easy పెట్రోల్ ఇంజన్ ను ఈ కార్ కలిగి ఉంది. అంతేకాకుండా ఈ కార్ 90 బిహెచ్ పి బ్రేక్ హార్స్ పవర్, 110 nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: