ఆంధ్రప్రదేశ్ లో అధికార
పార్టీ నేతలను
కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. ఒక్కసారి వచ్చిన వాళ్లకు కూడా రెండో సారి రావడం బాగా ఇబ్బంది పెడుతుంది. తాజాగా
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడుకి రెండో సారి కరోనా వచ్చింది.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన
అభినయ్ కి రెండవ సారి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఆగస్టు 23న
అభినయ్ కి మొదటి సారి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడు
హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన
అభినయ్ రెండవ సారి పాజిటివ్ రావడంతో తన
తండ్రి కరుణాకర్
రెడ్డి కరోనా తో చికిత్స పొందిన
తిరుపతి రుయా ఆసుపత్రిలోనే చికిత్సకు అడ్మిట్ అయ్యారు అభినయ్. భూమన కూడా కరోనా టెస్ట్ చేయించుకునే అవకాశం ఉంది.