కుంకుమ పువ్వు.. పుట్టబోయే బిడ్డ అందంగా, ఆరోగ్యంగా పుట్టాలని గర్భిణీలను పాలలో కొంచం కుంకుమ పువ్వు కలుపుకోమని తాగమని చెప్పినప్పుడు మనం విని ఉంటాం. ఆలా ఎందుకు చెప్తారంటే.. కుంకుమ పువ్వులో శక్తి వంతమైన మూలకాలు యాంటిఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఐరన్ శాతం పుష్కలంగా దొరుకుతుంది. 


అయితే ఈ కుంకుమ పువ్వు కావాల్సినంత అందాన్ని మెరుగు పరుస్తుంది. ఎంతో అందం ఇచ్చే ఈ కుంకుమ పువ్వులో ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కుంకుమ పువ్వుని అందానికి ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఉన్న చిట్కాలను చదివి తెలుసుకోండి. 


గంధపు పొడి, రెండు కుంకుమపువ్వు రేఖలు, పాలు కలిపి ఆ పేస్ట్ ను ఫేస్ మాస్క్ గా వేసుకుంటే నల్లని వలయాలను, మచ్చలను తగ్గిస్తుంది. 


తులసి ఆకులు, 10-12 కుంకుమ పువ్వు పోగులు కలిపి మెత్తగా పేస్టు లాగా చేసి ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు పోతాయి. 


పచ్చి పాలలో కొద్దిగా కుంకుమపువ్వును రాత్రంతా నానబెట్టి అందులో కొన్ని బాదం చుక్కలు, ఆలివ్ నూనె కలిపి రాసుకోవాలి.. ఇలా చెయ్యడం వల్ల నిర్జీవంగా మరీన చర్మంకు పోషణ అంది కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు ముఖం ఫ్రెష్ గా కూడా ఉంటుంది. 


అయితే కుంకుమ పువ్వు బంగారంతో సమానం.. చౌక ధరలో అసలు దొరకదు. ఒకవేళ ఆలా చౌక ధరలో కుంకుమ పువ్వు దొరికింది అంటే అది కచ్చితంగా నిజమైన కుంకుమ పువ్వు కాదు అని గుర్తించాలి. అసలైన కాశ్మీర్ కుంకుమపువ్వు చాలా ఖరీదైనది. 


మరింత సమాచారం తెలుసుకోండి: