ఇప్పుడు చాలా మందికి జుట్టు రాలిపోయి బట్టతల వస్తూ ఉంటుంది.అయితే మనకు రోజుకు దాదాపు 100 వెంట్రుకల వరకు జుట్టు రాలి ఊడిపోయి మళ్ళీ వస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోయిన స్థానంలో మళ్ళీ అంతే మొత్తంలో కొత్త వెంట్రుకలు వస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఊడిపోయే జుట్టు ఎక్కువగా ఇంకా వచ్చే జుట్టు తక్కువగా ఉండడం వల్ల జుట్టు పలుచబడుతుంది.వయసు పైబడే కొద్ది కొందరిలో జుట్టు ఊడిపోవడమే తప్ప మళ్ళీ రానే రాదు.అయితే మనం బట్టతల సమస్య  దరి చేరకుండా చూసుకోవడం మంచిది. జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి గల కారణాలను ఇంకా అలాగే కొత్త జుట్టు రాకపసోవడానికి గల కారణాలను తెలుసుకుంటే ఈ సమస్య మన దరి చేరకుండా చూసుకోవచ్చు. జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జుట్టు రాలడానికి గల కారణాల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. చుండ్రు వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. కాబట్టి చుండ్రు సమస్య మన దరి చేరకుండా చూసుకోవాలి. అందుకే చుండ్రు సమస్యతో బాధపడే వారు రోజూ తలస్నానం చేయాలి.తలస్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా చేతి గోర్లతో తలచర్మాన్ని బాగా రుద్దుతూ తలస్నానం చేయాలి.


ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న చుండ్రు సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇంకా జుట్టు రాలకుండా ఉంటుంది. ఇంకా అలాగే శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ప్రోటీన్ లోపించడం వల్ల జుట్టు కుదుళ్లు బాగా బలహీనపడి ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇక ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో సోయా బీన్స్ కూడా ఒకటి. సోయాబీన్స్ గింజలను ఉడికించి తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత ప్రోటీన్ అనేది లభిస్తుంది.ఇంకా అలాగే మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల కూడా శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుంది.అలాగే పెసర్లు, అలసందలు, శనగలు వంటి వాటిని మొలకలుగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. ఇంకా అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఊడిన జుట్టు స్థానంలో మరలా కొత్త జుట్టు వస్తుంది. అలాగే ప్రతి రోజూ మధ్యాహ్నం ఆకుకూరను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుందని ఇంకా అలాగే బట్టతల సమస్య మన దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: