తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1761 కు చేరింది. ఈరోజు నమోదైన కేసుల్లో అధిక సంఖ్యలో కేసులు జీ.హెచ్.ఎం.సీ పరిధిలోనే నమోదయ్యాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న వలస కార్మికులు ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. 
 
రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో నగర్వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా నగరాంలో మాత్రం వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కరోనా అదుపులోకి రావడం లేదు. నగరంలో కుటుంబాలకు కుటుంబాలే వైరస్ భారీన పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: