ఆంధ్ర‌ప్రదేశ్, తెలంగాణ మ‌ధ్య జ‌ల వివాదం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ రోజు ఏపీ కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో విద్యుత్ ఉత్ప‌త్తి విష‌యంలో తెలంగాణ వైక‌రిని కేబినెట్ తప్పుప‌ట్టింది. ఇక మీటింగ్ లో ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ లో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నాని అన్నారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే తాను ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడటం లేదని అన్నారు.

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అంటూ సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు జ‌గ‌న్ సూచనలు చేశారు. విద్యుత్ విషయంలో మరోసారరి కేఆర్ఎంబీ కి లేఖ రాయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఈ విష‌యంపై ప్ర‌ధాని మోడీకి జ‌గ‌న్ లేఖ రాయాల‌ని నిర్ణ‌యించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: