వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్న విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. యాక్టివ్ పాలిటిక్స్ లో భాగంగా ఎక్కువగా ఆయన చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ, చిత్రవిచిత్రమైన పేర్లు పెడుతూ ఎవరూ ఊహించని విధంగా సంబోధిస్తూ వరుస ట్వీట్లు పెడుతూ ఉంటారు. ఈ రోజు కూడా ఆయన వరుస ట్వీట్లతో చంద్రబాబు మీద విరుచుకుపడడ్డారు. 

అమరావతి కోసం జోలెపట్టి విరాళాలు, బంగారు అభరణాలు సేకరించావు అని విమర్శించారు. కానీ కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు మాత్రం ముందుకు రాడని ఎద్దేవా చేశారు. అనాథలైన పిల్లలకు పది లక్షలు డిపాజిట్ చేసి జగన్ గారి ప్రభుత్వం అండగా నిలిస్తే, ఆ విషయంలో నీకూ బాధ్యత ఉంది కదా బాబూ? అని ప్రశ్నించారు. ఇక పిచ్చి తగ్గింది రోకలి తలకు చుట్టండి అనేది పాత సామెత అని పేర్కొన్న విజయసాయిరెడ్డి 'ట్యాబ్లెట్లు టైంకు వేసుకుంటున్నా. మెంటల్ కండిషన్ ఓకే. జూమ్ మీటింగులో కూర్చుంటా' అనేది బాబు తెచ్చిన కొత్త సామెత అని ఎద్దేవా చేశారు. సారు జూమ్ అనగానే తమ్ముళ్లంతా ఫోన్లు వదిలేసి పారిపోతున్నారంట. ఆ పిచ్చి ఎప్పటికీ తగ్గదు. అది ఫ్యామిలీలోనే ఉంది అని వ్యగ్యంగా విమర్శించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: