కరోనా సెకండ్ వెవ్ తర్వాత మూత పడ్డ థియేటర్లు తిరిగి ఓపెన్ అయ్యి
సినిమా పండగ మళ్ళి మొదలయ్యింది. ప్రతి శుక్రవారం ఏం
సినిమా వస్తుందా అని సగటు అభిమాని ఎదురు చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్. అందుకు తగ్గట్టుగా నిర్మాతలు సినిమాలను సైతం సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న అతి పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే అది
సంక్రాంతి మాత్రమే, ఆరు నెలలకు ముందు నుంచి
సంక్రాంతి బరిలో ఉండటానికి హీరోలు తమ సినిమాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు
సంక్రాంతి అంటే సూపర్ స్టార్
కృష్ణ పేరు ప్రముఖంగా వినిపించేది. ఇప్పుడు ఆ లిస్ట్ లో మహేష్ బాబు కూడా చేరిపోయారు. ఒక్కడు
సినిమా తరువాత పోయిన ఏడాది సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాతో సంక్రాంతికి హిట్ కొట్టాడు మహేష్ బాబు. ఇక ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మళ్ళి
సంక్రాంతి బరిలో నిలవగా అందుకు తగ్గట్టుగా రిలీజ్ డేట్ ని ఫస్ట్ లుక్
పోస్టర్ గా విడుదల చేసారు
సినిమా యూనిట్, ఈ
పోస్టర్ కి 100K లైక్స్ రావడం చూస్తే అభిమానులు మహేష్
సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.