రాహుల్ తో సచిన్ భేటి : దేనికి సంకేతం ?
రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్  ఢిల్లీకి వచ్చారు. రాహుల్ గాంధీతో  సమావేశమయ్యారు. వీరి ఇరువురి సమావేశం  రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాహుల్, పైలెట్ భేటీ లో  సోనియా గాంధీ కుమార్తే  ప్రియాంక వద్రా కూడా పాల్గోన్నారు. ఇది సాధరణ సమావేశమేనని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.  
 రాజకీయ పరిశీలకులు అనుకున్నట్టే కాంగ్రెస్ రాజకీయాలు జరుగుతున్నయా ?  పంజాబ్  రాష్ట్రంలో  ఇటీవల జరిగిన రాజకీ పరిణామాలు,  ఆ పై జరిగిన ముఖ్యమంత్రి మార్పు అందరికీ తెలిసిందే.  పంజాబ్ తరువాత ఇక రాజస్తాన్ వంతు అంటూ ఊహాగాలు సాగాయి.  పంజాబ్ లో ముఖ్యమంత్రిని మార్చినట్లే రాజస్తాన్ లోనూ స్థాన భ్రంశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. వారి  ఊహాగానాలకు ఊతం ఇచ్చే సంఘటన తాగాజా జరిగింది. రాజస్థాన్ కాంగ్రెస్ నేత , రాజీవ్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన  పైలెట్ కుటుంబం.    రాజస్థాన్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ విజయం సాధించడంతో యువకుడైన సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి అవుతాడని అందరూ భావించారు.  అయితే ఆ సమయంలో సీనియర్ నేతలు చక్రం తిప్పడంతో కాంగ్రెస్ పార్టీ అశోక్ గెహ్లట్ వైపు మొగ్గు చూపింది. ఆయన్ని ముఖ్యమంత్రి గా చేసింంది. అదే మంత్రి వర్గంలో సచిన్ పైలట్ సభ్యుడిగా ఉన్నా ఇద్దరి మధ్యా సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రమే.
పంజాబ్ రాజకీయ పరిణామాల అనంతరం రాహుల్ గాంధీతో సచిన్ పైలెట్ సమావేశం కావడం ఎవరినీ ఆశ్యర్య చకితుల్ని చేయలేదు. అక్టోబర్ లో జరగనున్న మంత్రి వర్గ మార్పులలో తన అనుయాయులకు మంత్రి పదవులు దక్కించుకునేందుకు సచిన్ ఢిల్లీ వచ్చారని ఒక వర్గం పేర్కొంటుండగా, త్వరలో జరగ నున్న ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలలో ప్రచార అంశాలను చర్చించేందకు వచ్చారని మరి కొంత మంది కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలుచూస్తన్న ప్రియాంక వద్రాకు సచిన్ పైలెట్ బాల్య స్నేహితుడు. రాజస్తాన్ లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగుర వేయడానికి తీసుకున్న చర్యలను ప్రియాంక వద్రాకు వివరించేందకుకే పైలెట్ ఢిల్లీ వచ్చారని ఇంకొందరి ఉవాచ. ఏది ఏమైనా రాహుల్- సచిన్ ల భేటి ఎంతకు దారి తీస్తుందో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: