ఏపీ సీఎం జగన్ ఇవాళ కొందరి ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. 'జగనన్న తోడు' పథకం కింద చిరు వ్యాపారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో రుణాలను తాడేపల్లిలోని క్యాంపు  కార్యాలయం నుంచే సీఎం జగన్ మీట నొక్కి జమ చేయనున్నారు.
 
చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి రుణాలు ఈ పథకం ద్వారా ‌అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. మొత్తం 5.10 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్లు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. రూ.16.16 కోట్ల వడ్డీ రీ ఇంబర్స్‌మెంట్‌ కలిపి రూ.526.62 కోట్లు ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: