తెలంగాణ సీఎం కేసీఆర్.. జగన్‌కు డబ్బు పంపారా.. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయం కోసం జగన్ కు కేసీఆర్ ఆర్థిక సాయం చేశారా.. అవునంటున్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. గత ఎన్నికల్లో ఒక్క ఏపీకే కాదు.. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, బీహార్, యూపీ ఎన్నికలకు డబ్బులు పంపారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపిస్తున్నారు. ఉప ప్రాంతీయ పార్టీకి ఇన్ని వందల కోట్ల ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందో కేసీఆర్, ఆయన బానిసలు చెప్పాలని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అంటున్నారు.


కేసీఆర్ కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. హుజురాబాద్ ప్రజల అభిప్రాయాన్ని నిషేధించిన కేసీఆర్... నన్ను అసెంబ్లీలోకి రానియ్యలేదని తెలిపారు. తెరాస లేదు... బీఆర్ఎస్ లేదని.. పార్టీలో నుంచి అందరూ పోతున్నా కేసీఆర్ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. తాను ఎదుగుతున్నానని... కుట్రలు పన్ని బయటకు పంపించారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: