పాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే భాజపా పోరాటం చేస్తోందనీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. రెండు లక్షల రుణమాఫీ ఎప్పటి వరకు చేస్తారో స్పష్టం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని తెలిపారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని భాజపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు హామీ ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉందన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..  పాత రైతు బంధునే ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr