
ఇకపోతే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. కాశ్మీర్ పీవోకే లో భారత సైన్యం దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ లోని భారత్ 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాలతో పాటు పలు చోట్లలో మెరుపు దాడులు చేసినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది.
భారత్ దాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆర్మీ పూంఛ్, రాజౌరి సెక్టార్లలో కాల్పులు మొదలుపెట్టింది. భారత్ కూడా దాడులు చేస్తూనే ఉంది. ఇటు భారత్, అటు పాకిస్తాన్ ఇరుదేశాల సైనికులు కాల్పులు జరిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో చాలా మంది చనిపోయారని పాక్ ఆర్మీ వెల్లడించింది. అలాగే చాలా మందికి గాయాలయ్యాయని తెలిపింది.