ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రజలు డిజిటల్ లావాదేవీలని బాగానే వినియోగిస్తున్నారు. మూడేళ్ళ క్రితం ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత, భారత దేశంలో డిజిటల్ లావాదేవీలను మరింతగా అభివృద్ధి చేసేలా ప్రజల కోసం పలు పద్ధతులు అమల్లోకి తెచ్చారు. ఇక అదే సమయంలో జీరో బ్యాలన్స్ అకౌంట్స్ మెల్లగా ఊపందుకున్నాయి. బ్యాంకు అకౌంట్ తెరవలేని, మధ్యతరగతి, దిగువతరగతి వర్గాల వారికోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ జీరో బ్యాలన్స్ అకౌంట్స్ ని అందుబాటులోకి తెచ్చారు. మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బిఐ, ఈ తరహా జీరో బ్యాలన్స్ అకౌంట్స్ ని ప్రోత్సహించడం కోసం పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మాదిరిగానే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో కూడా వడ్డీరేట్లు సమానంగా ఉంటాయి. 

 

ఇక ఈ తరహా అకౌంట్ ని తెరవేరడం కోసం ముందుగా భారతీయ పౌరుడైన ఖాతాదారుడు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటి జీరాక్స్ కాపీలను బ్యాంక్ కు సమరించవలసి ఉంటుంది. ఇక అకౌంట్ తెరచిన తరువాత ప్రతి ఒక్క ఖాతాదారుడికి రూపే చిప్ డెబిట్ కార్డును బ్యాంక్ ఉచితంగా అందచేస్తుంది, దీనికి ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. అయితే ఈ జీరో బాలన్స్ అకౌంట్ లో మనం మినిమమ్ బ్యాలన్స్ మన ఖాతాలో మెయింటెయిన్ చేయవలసిన అవసరం లేదు. కాగా ఈ అకౌంట్స్ లో లావాదేవీలపై కొంత పరిమితి మాత్రం ఉంటుంది. ఇక ఈ అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారుడు తన డెబిట్ కార్డును ప్రతి నెలలో నాలుగు సార్లు ఉచితంగా ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకునే వీలు ఉంటుంది. అలానే ఈ తరహా ఖాతాలకు చెక్ బుక్ ఫెసిలిటీ అయితే లభించదు. ఎందుకంటే పేద వర్గాల వారికి చెక్ బుక్ యొక్క అవసరం చాలా వరకు ఉండదని, 

 

అదీ కాక ఇటీవల జీరో బ్యాలన్స్ అకౌంట్ ని వినియోగిస్తున్న చాలా మంది ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను విరివిగా వినియోగిస్తున్నందున చెక్ అవసరం చాలా వరకు లేకుండా పోయింది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ జీరో బ్యాలన్స్ అకౌంట్ తెరవాలంటే, మనకు ఇతర బ్యాంకుల్లో ఎటువంటి అకౌంట్ కలిగి ఉండకూడదు, ఒకవేళ గతంలో మనకు సేవింగ్స్ అకౌంట్ ని కలిగి ఉంటె, దానిని క్లోజ్ చేసిన తరువాతనే ఈ జీరో బ్యాలన్స్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. కాగా అన్ని విధాలుగా పేద వర్గాల వారికి ఎటువంటి మినిమమ్ బ్యాలన్స్ వంటి నియమాలు లేకుండా, అలానే ఉచిత డెబిట్ కార్డు సేవల వంటివి కల్పిస్తున్న ఈ జీరో బ్యాలన్స్ అకౌంట్స్ పై ఖాతాదారులు కూడా బాగానే మొగ్గుచూపుతున్నారని అంటోంది ఎస్బిఐ యాజమాన్యం......!!

మరింత సమాచారం తెలుసుకోండి: