ఈజీగా డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అయితే ఎలాంటి వాటిలో ఇన్వెష్ట్ చేయాలి.. ఎంత డబ్బులు పెడితే లాభాలు వస్తాయి.. ఇలాంటి సందేహాలు అందరికీ వస్తాయి.  కొన్ని రకాల స్కీమ్ లను ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. ఆ స్కీమ్ లు ఎంటో పూర్తి వివరాలు ఇలా తెలుసుకుందాం. ఆయితే మీకు ఇది గుడ్ న్యూస్. పోస్టాఫీస్ ఆర్‌డీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుని లాభం కూడా పొందొచ్చు. ఇందులో చాల ఆప్షన్లు అందుబాటు లో ఉంటాయి కూడా. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తి వివరాలని ఇప్పుడే చూసేయండి.


పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఆయితే వాటిలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఒక భాగమనే అనొచ్చు. ఆయితే మంచి బెనిఫిట్స్ కూడా మీరు పొందవచ్చు...పోస్టాఫీస్ అందించే పలు స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ ఉండదు. పైగా మంచి రాబడి పొందొచ్చు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చెయ్యాలంటే నెలకు రూ.100 నుంచి కూడా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.అంతకు మించి కూడా ఉంది.


ఈ స్కీమ్ లో కనుక ఐదేళ్లు ఉంటే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు.. ఆర్‌డీ అకౌంట్‌పై 5.8 శాతం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చుతూ ఉంటుంది. ఇందులో కనుక మీరు ప్రతి నెలా రూ.10 వేలు డిపాజిట్ చేసారంటే పదేళ్లలో రూ.16 లక్షలకు పైగా లభిస్తాయి. నాలుగు నెలలు ఇందులో డబ్బులు కట్టలేదు అంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది. .. అలా మళ్లీ డబ్బులు కట్టి రీ ఓపెన్ చేయాలి.. అంతే తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదు..

మరింత సమాచారం తెలుసుకోండి: