మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్ లో భాగంగా కొన్ని కొత్త కొత్త విధానాలను తీసుకువహ్సిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి డిజిటల్ కరెన్సీ, రాబోయే కాలంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఇండియాలో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని పెంచాలి అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుండి బిట్ కాయిన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది అని చెప్పాలి. ఈ వారం మొత్తం క్రిప్టో మార్కెట్ లాభాల బాటలోనే నడుస్తూ ఉంది. అంతే కాకుండా మార్కెట్ కు చివరి రోజు అయినా శనివారం కూడా క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ముగిసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిట్ కాయిన్ ను ఒకవైపు ట్రేడర్లు మరోవైపు ఇన్వెస్టర్లు ఎక్కువగా కొంటున్నట్లు సమాచారం.

ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో ఈ బిట్ కాయిన్ మొత్తంగా 8.90 శాతం వరకు లాభాలు పొందినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి బిట్ కాయిన్ విలువ ఈ ఒక్క రోజులో 2 లక్షలు పెరిగి యిప్పుడు రూ. 32.41 లక్షల వద్ద ఉంది. ఇప్పుడు మార్కెట్ లో దీని విలువ రూ. 55.08 లక్షల కోట్లు అంటే నమ్మండి. ఈ క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ తో ముడిపడి ఉంటుంది. అయితే గత వారం రోజుల ముందు వరకు బిట్ కాయిన్ లో తక్కువగా హెచ్చు తగ్గులు ఏర్పడుతూ వచ్చాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం బిట్ కాయిన్ వీలుబ అంతా అమెరికా మార్కెట్ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నది నమ్మాల్సిందే.

ఈ వారం అంతా అమెరికా మార్కెట్లు బాగా లాభపడడంతో బిట్ కాయిన్ విలువ కూడా పెరిగింది అని కొందరు అంటున్నారు. సడెన్ గా ఇలా బిట్ కాయిన్ విలువ పెరగడంతో మార్కెట్ లో అందరూ షాక్ కు గురవుతున్నారు. ఇదే టెక్నాలజీ తో బిట్ కాయిన్ తర్వాత అంతే విలువ కలిగిన ఈథర్ కూడా కొంత లాభాలను పొందినది.  

మరింత సమాచారం తెలుసుకోండి: