ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని ప్రతి సామాన్యుడికి ఒక కల ఉంటుంది. విమాన ప్రయాణం మన స్తోమతకి తగినది కాదు అంటూ సామాన్యులందరూ కూడా తమకు తాము సర్ది చెప్పుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇక పైసా పైసా కూడా పెట్టుకుని విమానం ఎక్కాలన్న కలను నిజం చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో సామాన్యుడి కలను నిజం చేసేందుకు ఎన్నో విమానయాన సంస్థలు అతి తక్కువ ధరకే విమాన టికెట్ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.


 ఇలాంటి ఆకర్షనీయమైనా ఆఫర్లను వినియోగించుకుంటున్న ఎంతోమంది కామన్ మ్యాన్స్ సైతం విమానంలో ప్రయాణించాలి అనే కలను సహకారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల ఇలాంటి ఒక ఆఫర్ సామాన్యులు అందరికీ కూడా ఆకర్షిస్తోంది. ప్రముఖ విమాన కంపెనీ స్పైస్ జెట్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కళ్ళు చెదిరే ధరకే టికెట్లను విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఒక ఆఫర్ ను ప్రకటించింది. కేవలం 1515 రూపాయలకే విమాన ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ కేవలం డొమెస్టిక్ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.


 స్పెషల్ ఆఫర్ టికెట్ల విక్రయం ఆగస్టు 14 నుంచి ప్రారంభమై ఆగస్టు 20వ తేదీతో ముగుస్తుంది అని స్పైస్ జెట్ కంపెనీ వెల్లడించింది. టికెట్లు బుక్ చేసుకునేవారు ఆగస్టు 15 నుండి మార్చి 30 మధ్యకాలంలో ఎప్పుడైనా తమ ప్రయాణాన్ని బుక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఈ ఆఫర్ కింద కేవలం లిమిటెడ్ సంఖ్యలో సీట్లను మాత్రమే ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది స్పైస్ జెట్ కంపెనీ. ఒకవేళ త్వరపడి టికెట్లు బుక్ చేసుకోకపోతే మాత్రం సాధారణంగా లభించే రెగ్యులర్ ధరలకే మళ్ళీ ప్రయాణికుల టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది అని చెప్పాలి. అయితే ఈ స్పెషల్ ఆఫర్ ఏ ఏ మార్గాల్లో ప్రయాణించే విమాన సర్వీసులకు అందుబాటులో ఉంటుందనే వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వెబ్సైట్ కి వెళ్లాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: