మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వాలు నిర్భ‌య లాంటి చ‌ట్టాలు ఎన్నింటిని తీసుకొచ్చినా కానీ మ‌హిళ‌ల‌పై దాడులు మాత్ర‌ము కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న మాదిరిగానే ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఒక యువ‌తిని అతి కిరాత‌కంగా చంపేసారు.  దారుణ‌మేమిటంటే ఆమె జ‌ననాంగాన్ని సైతం కాల్చేసారు దుండ‌గులు. ఈ ఘ‌ట‌న సౌత్ వెస్ట్ ఢిల్లీ ద్వార‌కాలోని డాబ్రీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న‌ది.

డాబ్రీ సెక్టార్‌-2లో సీఎన్‌జీ ప్యూయ‌ల్ పంపు వ‌ద్ద ఓ నాలా ఉన్న‌ది. ఓ యువ‌తి మృత దేహ‌మున్న‌ద‌ని ఓ వ్య‌క్తి చూసి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే సీనియ‌ర్ పోలీస్ అధికారులు అక్క‌డిక చేరుకుని ఆకుప‌చ్చ‌రంగులో ఉన్న బెడ్ షీట్ లాంటి వ‌స్త్రంలో చుట్టి ఉంచిన మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. అలాంటి వ‌స్త్రాన్ని కేవ‌లం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో మాత్ర‌మే వినియోగిస్తారు. ఆమె నుదిటి, ప్ర‌యివేటు భాగాల్లో కాలిన గుర్తులు కూడ ఉన్నాయ‌ని, ఇవ‌న్ని చూస్తుంటే దాడి చేసి చంపార‌ని పోలీసులు భావించారు. వేరోచోట హ‌త్య చేసి డెడ్‌బాడీని నాలా వ‌ద్ద డంప్ చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.  మృత‌దేహం ఉన్న తీరును చూసి ఏకంగా పోలీసులే షాక్‌కు గురయ్యారు. ఆమె వివ‌స్త్ర‌గా ఉండ‌డ‌మే కాకుండా గుర్త‌ప‌ట్ట‌కుండా.. వివ‌రాలు తెలియ‌కుండా  ఉండేందుకు ఆమెను కాల్చారు.  

ఆమె ముఖంతో పాటు జ‌ననాంగాన్ని కూడ కాల్చివేసారు దుండ‌గులు. స‌ద‌రు యువ‌తిపై అత్యాచారం చేసిన త‌రువాత‌నే హ‌త్య చేసి ఉండ‌వ‌చ్చ‌ని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మృతురాలు వివ‌రాల‌ను క‌నిపెట్టే ప‌నిలో పోలీసులు ఉన్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఢిల్లీలో అదృశ్య‌మైన కేసుల వివ‌రాల‌న్నింటిని సేక‌రిస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని.. పోస్టుమార్టం నివేదిక ఎప్పుడు వ‌స్తున్న‌ద‌ని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమెపై అత్యాచారం జ‌రిగిన‌దా..? జ‌ర‌గ‌లేదా.. ఎలా మృతి చెందింది. అనేది పోస్టుమార్టం రిపోర్టులో వెల్ల‌డి కానున్న‌ది.
 
ఈ ఘ‌ట‌న‌పై ద్వార‌కా  డీసీపీ శంక‌ర్ చౌద‌రి స్పందించారు.  ఆ యువ‌తిని గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని వెల్ల‌డించారు. ఆ వ‌య‌స్సు గ‌ల యువ‌తులు ఎవ‌రైనా మిస్సింగ్ అయిన‌ట్టు ఫిర్యాదులు అందాయా అనే విష‌యాల‌ను తెలుసుకుంటున్నాం. ప్ర‌త్యేక బృందాలు స్థానికుల‌తో మాట్లాడి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌, క్రైమ్ టీమ్ స్పాట్ కి వచ్చి పరిశీలించారు. అలాగే పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు.  త్వరలోనే అనుమానితులను పట్టుకుంటామని డీసీపీ శంక‌ర్ చౌద‌రి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: