ఒకప్పుడు ప్రేమ అంటే కళ్ళతో చూసుకోవడం అంటారు.. పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా వ్యతిరేకం.ప్రేమ కేవలం అవసరాలకు మాత్రమే వాడుతున్నారు.. ఒకరినొకరు ఇష్ట పడటం, నచ్చితే డేటింగ్ పేరుతో కామ కోరికలు తీర్చుకోవడం, ఇంకా ఇష్టం తగ్గకుంటే జీవితాంతం కలిసి ఉంటారు.వద్దు అనుకుంటే మాత్రం విడి పోతారు. ఈ రోజుల్లో ప్రేమలు ఇలానే ఉన్నాయి.. వయస్సు తో సంబంధం లేకుండా శారీరక కోరికలు తీర్చుకోవడం యూత్ కు సరదా అయిపోయింది.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక తొందరపడి బాయ్ ఫ్రెండ్ తో తప్పు చేసింది. అయితే ఆమె గర్భం దాల్చింది.


అది అందరికి తెలిసి పోతుందని భయంతో యూట్యూబ్ చూసి అబార్షన్ చేసుకొనే ప్రయత్నం చేసింది. అలా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. వివరాల్లొకి వెళితే.. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.నాగ్ పూర్‌లోని నార్ఖేడ్ కు చెందిన బాలిక, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. గతేడాది ఆ యువకుడికి నాగపూర్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు నాగపూర్ లోని ఐఎండీసీ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆరు నెలల క్రితం ఆమె నార్ఖేడ్ నుంచి నాగపూర్ తన బాయ్‌ప్రెండ్ రూమ్‌కు వెళ్ళింది. అక్కడ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. కొన్నాళ్లకు ఆ బాలిక గర్భం దాల్చింది.


ఆ విషయం బాయ్ ఫ్రెండ్ కు విషయం చెప్పింది. గర్భం పోవడానికి కొన్ని మాత్రలను ఇచ్చారు. అయిన గర్భం పోలేదు.అబార్షన్ ఎలా చేసుకోవాలో అని యూట్యూబ్ చూసింది. అందులో చెప్పినట్లు నాలుగు రోజుల క్రితం ఇంట్లో అబార్షన్ కోసం ప్రయత్నించింది. ఆసమయంలో అబార్షన్ అయి, పసిపాప నేలమీద పడటంతో ఇంట్లో కుటుంబ సభ్యులు చూశారు. వెంటనే బాలికను, పసి పాపను ఆసుపత్రికి తరలించారు.. కానీ అప్పటికే పాప చనిపొయింది. ఇకపోతే బాలిక పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పారు.. ప్రియుడి విషయం గురించి తెలుసుకొని పొక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: